నేడు వైసీపీకి మంత్రి జయరాం రాజీనామా.. బాబు సమక్షంలో టీడీపీలో చేరిక

  • భారీ కాన్వాయ్ తో విజయవాడకు చేరుకున్న జయరాం
  • సాయంత్రం టీడీపీలో చేరిక
  • గుంతకల్లు టికెట్ ఆశిస్తున్న జయరాం
ఏపీ మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఈరోజు మంత్రి పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. గుమ్మన జయరాం సోదరులు ఆలూరు నుంచి భారీ కాన్వాయ్ తో విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో జయరాం రాజీనామా చేయనున్నారు. ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ను గుమ్మనూరు జయరాం ఆశిస్తున్నారు. జయరాంకు ఈసారి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ను సీఎం జగన్ నిరాకరించారు. కర్నూలు ఎంపీ టికెట్ ను ఆఫర్ చేశారు. అయితే ఈ ఆఫర్ ను జయరాం తిరస్కరించారు. చివరకు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. 


Gummanuru Jayaram
YSRCP
Chandrababu
Telugudesam
Guntakal

More Telugu News